టీడీఎఫ్ లోగో రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కోదండరాం

టీడీఎఫ్ లోగో రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ డెవలప్​ మెంట్ ఫోరం (టీడీఎఫ్) సిల్వర్ జూబ్లీ లోగోను ఎమ్మెల్సీ కోదండరాం మంగళవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ డీపీ రెడ్డి, ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. టీడీఎఫ్​సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కోదండరాం అన్నారు.

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ లోగోను ఆవిష్కరించారని టీడీఎఫ్​యూఎస్ఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్, భరత్, శ్రవంత్,  శ్రీనాథ్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆవిర్భవించిందని నేతలు డీపీ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. 25 ఏండ్లు పూర్తి చేసుకోవడంతో త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు.