జూన్‌లో తెలంగాణ ఎంసెట్‌..!

జూన్‌లో తెలంగాణ ఎంసెట్‌..!

జూన్‌లో ఇంజనీరింగ్,అగ్రికల్చర్,మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS EAMCET) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది..గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా ఎంసెట్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్షనిర్వహించడంతో పాటు.. సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు JEE మెయిన్స్,అడ్వాన్స్‌డ్‌ను ఏప్రిల్,మేలో పూర్తి చేసేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జూన్‌ ఆఖరు కల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సీట్లపై స్పష్టత వస్తుందని.. అప్పుడు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చని తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం..

కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదు