కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదు

కాంగ్రెస్ లేకుండా  ఫ్రంట్ సాధ్యం కాదు

ముంబై: కాంగ్రెస్ లేకుండా ఎలాంటి పొలిటికల్ ఫ్రంట్ సాధ్యం కాదన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫ్రంట్ ను ప్రతిపాదించారని చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ ను కలుపుకునే ఫ్రంట్ ఉండాలని చెప్పామన్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ముంబైలో కలిశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్సేతర సీఎంలతో కలిసి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారని  ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరికొన్ని వార్తల కోసం:

నేను డబ్బు ఇవ్వను... మీరూ తీసుకోవద్దు