తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..ర్యాంక్ చెక్ చేసుకోండిలా

తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..ర్యాంక్ చెక్ చేసుకోండిలా

తెలంగాణ ఎడ్ సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేశారు అధికారులు. అర్హత సాధించిన అభ్యర్థులకు బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష కాకతీయ యూనివర్శిటీ నిర్వహించింది. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.

తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షలు జూన్ 1వ తేదీన నిర్వహించారు. ఈసారి జరిగిన ఎడ్ సెట్ పరీక్షలకు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 30వేల 944 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 96.38 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రటకించారు అధికారులు .ఈ ఫలితాల్లో గణపతి శాస్త్రి 126 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 121 మార్కులతో శరత్ చంద్ర రెండో ర్యాంక్ సాధించారు. 

TG Ed. CET 2025 ర్యాంకు కార్డు డౌన్ లోడ్ విధానం

  • అభ్యర్థులు ముందుగా టీజీ ఎడ్ సెట్ https://edcet.tgche.ac.in/అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హెూంపేజీలో డౌన్ లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి 
  • అభ్యర్థి Ed.CET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ డిటెయిల్స్ ఎంటర్ చేయాలి 
  • 4. View Rank Card పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై విద్యార్థి ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది 
  • ర్యాంకు కార్డును డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.  
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.