
అంబర్పేట్,వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ అహంకార పాలనను తరిమికొట్టాలని కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అంబర్ పేట సెగ్మెంట్ లోని పటేల్ నగర్ లో నిర్వహించిన సభలో పాల్గొని జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ తో అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.