ఓట్ల లెక్కింపు టైమింగ్ ఎలా ఉంది.. ఎన్ని గంటలకు ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి..?

ఓట్ల లెక్కింపు టైమింగ్ ఎలా ఉంది.. ఎన్ని గంటలకు ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ టైమింగ్స్ డిసైడ్ చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లోని అధికారులు ఈ సమయాలను ఫాలో కావాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ పూర్తవ్వటం.. అభ్యర్థులకు సర్టిఫికెట్లు జారీ చేయటం వంటి అంశాలకు సంబంధించి ప్రాథమికంగా సమయాలను నిర్దేశించింది. 

>>> ఉదయం 5 గంటలకు పోలింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోవాలి. 
>>> బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకురావటంతోపాటు.. ఇన్ అండ్ ఔట్ చెక్ చేసుకోవాలి.
>>> ఉదయం 8 గంటలకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.
>>> ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.
>>> బ్యాలెట్ ఓట్ల లెక్కింపు 8:30 గంటలకు పూర్తి కాకపోయినా.. ఈవీఎం ఓట్ల లెక్కింపు సమాంతరంగా ఈ ప్రక్రియ సాగుతుంది. 
>>> గెలిచిన అభ్యర్థికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినట్లయితే.. అతన్ని వెంటనే గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తూ.. పోలింగ్ స్టేషన్ రిటర్నింగ్ అధికారి సర్టిఫికెట్ జారీ చేస్తారు.
>>> 2023, డిసెంబర్ 3వ తేదీ ఆదివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయానికి మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఎలక్షన్ కమిషన్. అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేసింది.
>>> ఏదైనా నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆలస్యం అయినా.. పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. అన్ని అభ్యంతరాలు క్లియర్ అయిన తర్వాత రిజల్ట్ డిక్లర్ చేస్తారు అధికారులు. 

ఓవరాల్ గా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యి.. సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఉదయం 9 గంటలకు అధికారికంగా రావొచ్చు.