నామినేషన్లకు మరికొన్ని గంటలే : ఇంకా అభ్యర్థులను తేల్చని పార్టీలు

నామినేషన్లకు మరికొన్ని గంటలే : ఇంకా అభ్యర్థులను తేల్చని పార్టీలు

= 11 సీట్లలో అభ్యర్థులను తేల్చని బీజేపీ
= 4 సీట్లు పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్
= కాంగ్రెస్ తో సీపీఎం కలిసొస్తుందా?
= చివరి ప్రయత్నాల్లో హస్తం పార్టీ లీడర్లు

హైదరాబాద్: నామినేషన్లకు ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉంది. కొన్ని సెగ్మెంట్లలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను తేల్చలేదు. దీంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ 119, కాంగ్రెస్ 114, బీజేపీ 108(8 సీట్లు జనసేన)కు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేనకు కేటాయించిన బీజేపీ.. పెద్దపల్లి, సంగారెడ్డి, నర్సంపేట, మధిర, అలంపూర్, దేవరకద్ర, నాంపల్లి, కంటోన్మెంట్, శేరిలింగంపల్లి, మల్కాజ్ గిరి, మేడ్చల్ స్థానాలను బీజేపీ పెండింగ్​లో పెట్టింది.

ఈ సెగ్మెంట్ల నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనేది తేలాల్సి ఉంది. సీపీఎంతో పొత్తు కుదురుతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ చివరి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సీపీఎం నో చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు19 స్థానాల్లో తమ అభ్యర్థులు నామినేషన్ వేసే తేదీలను సీపీఎం ప్రకటించింది.

రేపటిలోగా ఏమైనా జరగొచ్చనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ సెగ్మెంట్లకు అభ్యర్థులను తేల్చాల్సి ఉంది. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల వ్యవధిలో నామినేషన్ల గడువు ముగియనున్నా రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను తేల్చకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 10వ తేదీ..