చెన్నూర్​లో కాంగ్రెస్​ జోష్.. వివేక్​కు జై కొడుతున్న యూత్​

 చెన్నూర్​లో కాంగ్రెస్​ జోష్.. వివేక్​కు జై కొడుతున్న యూత్​
  • చెన్నూర్​లో కాంగ్రెస్​ జోష్
  • 40 వేల ఉద్యోగాల హామీతో వివేక్​కు జై కొడుతున్న యూత్​
  • గులాబీ పార్టీకి గుడ్​బై చెప్తున్న లీడర్లు, ప్రజాప్రతినిధులు 
  • రైతులు, సింగరేణి కార్మికుల మద్దతు వివేక్​కే..
  • బాల్క సుమన్​, అనుచరుల ఆగడాలతో విసుగెత్తిన జనం
  • ప్రచారానికి పోవాలంటేనే భయపడుతున్న బీఆర్ఎస్​ లీడర్లు 
  • పోల్​ మేనేజ్​మెంట్​పైనే దింపుడు కల్లం ఆశలు

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ (ఎస్సీ)​ సెగ్మెంట్ రాష్ర్టంలోనే హాట్​సీట్​గా మారింది. కాంగ్రెస్​ నుంచి పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్​ వెంకటస్వామి, బీఆర్ఎస్ ​నుంచి ప్రభుత్వ విప్ ​బాల్క సుమన్​ ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. వాస్తవానికి వివేక్​ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ, నియోజకవర్గంలోని అనుచరులు, అభిమానుల ఒత్తిడి మేరకు అసెంబ్లీ బరిలో నిలిచారు. వివేక్ ​రాకతో ఒక్కసారిగా నియోజకవర్గంలో పొలిటికల్​ సీన్ ​మారిపోయింది. మొన్నటిదాకా చెన్నూర్​లో తనకు ఎదురే లేదనుకున్న సుమన్ బలమైన ప్రత్యర్థి రావడంతో డిఫెన్స్​లో పడ్డారు. రోజురోజుకు బీఆర్ఎస్ ​గ్రాఫ్​ డౌన్ ​అవుతూ...కాంగ్రెస్​ గ్రాఫ్​పెరుగుతుండడంతో బుగులు పడుతున్నారు. 

ప్రచారంలో దూసుకెళ్తూ...

లేట్​అయినా లేటెస్ట్​గా వచ్చిన వివేక్​ వెంకటస్వామి 15 రోజులుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 6న జైపూర్ ​మండలం ఇందారం నుంచి చెన్నూర్​ వరకు 25 కిలోమీటర్లు భారీ బైక్​ ర్యాలీ నిర్వహించి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించారు. రోజూ పొద్దుట ఆరు గంటలకు మార్నింగ్​వాక్​తో స్టార్ట్​ చేసి రాత్రి పదింటి దాకా విరామం లేకుండా పల్లెల్లో పర్యటిస్తున్నారు. 

ఏ ఊరికి వెళ్లినా ఆయనకు  జనాలు  డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, బిడ్డ పెండ్లి రోజు అరెస్టు, పార్లమెంట్​లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భం గురించి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. వివేక్​ సతీమణి గడ్డం సరోజ గ్రామాల్లో ప్రచారం చేస్తూ తన ప్రసంగంతో ఆకట్టుకుంటున్నారు. కొడుకు వంశీకృష్ణ యువకులతో భేటీ అవుతూ తండ్రికి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  

ప్రజా సమస్యలే ఎజెండాగా...

వివేక్ ​వెంకటస్వామికి చెన్నూర్​ నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండడంతో ప్రచారంలో ప్రజా సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ​కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్​ భగీరథ పథకాల్లో లక్ష కోట్లకు పైగా దోచుకున్నాడని, బాల్క సుమన్​ల్యాండ్​, సాండ్​ దందాలతో రూ.వెయ్యి కోట్లకు పైగా సంపాదించాడంటూ.. 30 పర్సెంట్​ కమీషన్​ గవర్నమెంట్​నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

 డబుల్​ బెడ్రూంలు, దళితులకు మూడెకరాల భూమి, దళితబంధులో కమీషన్లు, నిరుద్యోగ భృతి, రేషన్​ కార్డులు, 57 ఏండ్లకే పింఛన్లు, మిషన్​ భగీరథ స్కీం, ఇతర వైఫల్యాలను వివరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​ ముంపు రైతుల కోసం తాను పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, తనను గెలిపిస్తే న్యాయం జరిగేలా చూస్తానని  బాధితులకు వివేక్​భరోసా ఇస్తున్నారు. 

తన తండ్రి వెంకటస్వామి కృషితోనే జైపూర్​ఎస్టీపీపీ ఏర్పాటైందని, తాను ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేశానని, మందమర్రి, బెల్లంపల్లి వాటర్ స్కీమ్, రూ.400 కోట్లతో రోడ్లు, తాగునీటి పథకాలు తీసుకొచ్చానని చెబుతున్నారు. తన అన్న వినోద్​ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన బ్రిడ్జిలను కూడా సుమన్ ​తన ఖాతాలో వేసుకున్నాడని వివరిస్తున్నారు. సుమన్ ​ఒంటెత్తు పోకడలు, అనుచరుల ఆగడాలు, ప్రశ్నించిన వారిపై పెట్టిన కేసులు, చేసిన దాడుల గురించి నిలదీస్తున్నారు. నాడు వంద కేసులున్నాయన్న సుమన్​కు రూ.వెయ్యి కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. 

సింగరేణి కార్మికులు, యూత్​పై ఫోకస్​...

సింగరేణి అప్పులపాలై బీఐఎఫ్ఆర్​ పరిధిలోకి వెళ్లినప్పుడు కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల లోన్​ ఇప్పించి సంస్థను కాపాడారు. సింగరేణి 
కార్మికులకు పెన్షన్ ​విధానం తీసుకొచ్చారు. సింగరేణిలో తెలంగాణ వచ్చే నాటికి 60 వేలకు పైగా ఉద్యోగులుంటే కేసీఆర్​ వచ్చిన తర్వాత 20 వేల మందిని ఇంటికి పంపడంతో ఆ సంఖ్య 40 వేలకు చేరింది.  ఈ క్రమంలో కాంగ్రెస్​ను గెలిపిస్తే కార్మికులకు ఇన్​కమ్​టాక్స్​ రీయింబర్స్​మెంట్, రిటైర్డ్​ కార్మికులకు క్వార్టర్లు కేటాయింపు, కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివేక్​ హామీ ఇస్తున్నారు. 

ట్రాన్స్​కో, జెన్​కోల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.25వేల కోట్ల బకాయిల అంశాలను ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గంలో మూడు స్కిల్ ​డెవలప్​మెంట్​ సెంటర్లు, చెన్నూర్​లో మైనింగ్ ​ఇన్​స్టిట్యూట్, అగ్రికల్చర్ ​మినీ యూనివర్సిటీ, కొత్త వంగడాల కోసం అగ్రి రీసెర్చ్​సెంటర్, సిరామిక్​  టైల్స్​ఇండస్ర్టీ అభివృద్ధి ద్వారా 40 వేల ఉద్యోగాలు కల్పిస్తానంటూ వివేక్​ యువతకు భరోసా ఇస్తున్నారు.  

సుమన్​కు నిరసనల భయం..

​ఎమ్మెల్యే బాల్క సుమన్ ​వేల కోట్లతో చెన్నూర్ ​నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటుండగా, ఇందులో చాలావరకు సెంట్రల్ ఫండ్స్​, డీఎంఎఫ్​టీ ఫండ్స్​ కింద మంజూరైన పనులే ఉన్నాయి. ఎన్నికల ముందు హడావుడి కొబ్బరికాయలు కొట్టి వదిలేసినవి, అసంపూర్తిగా మిగిలిన పనులను సైతం ‘ప్రగతి నివేదిక’లో ప్రస్తావించారు. 

చెన్నూర్​లో డబుల్ ​బెడ్రూమ్​లు, స్కిల్​ డెవలప్​మెంట్​సెంటర్​ పునాదులకే పరిమితం కాగా, ఇంటిగ్రేటెడ్​ మార్కెట్, డంపింగ్​యార్డు, ట్యాంక్​ బండ్​లు, బస్​ డిపో,100 బెడ్స్​ హాస్పిటల్ అసంపూర్తిగా ఉన్నాయి. 50 బెడ్స్ హాస్పిటల్ ​కట్టినా అందులో సరైన డాక్టర్లు లేరు.  వివేక్ ​ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన క్యాతన్​పల్లి ఆర్వోబీ పనులు  పూర్తి చేయకపోవడంతో ప్రజలు గుర్రుగా ఉన్నారు. మందమర్రి, చెన్నూర్​లో రోడ్ ​వైడింగ్, డివైడర్లు, సెంట్రల్​ లైటింగ్​ ఏర్పాటు చేసి అదే అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడని ప్రజలు మండిపడుతున్నారు.

 కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​ ముంపు రైతులకు నాలుగేండ్లుగా పరిహారం ఊసెత్తని సుమన్​ఇటీవల గోదావరికి కరకట్టలు కడుతామని, నష్టపరిహారం ఇస్తామని చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. సింగరేణి ఓసీపీల్లో, జైపూర్​ ఎస్టీపీపీలో కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్ ఉద్యోగాల కోసం వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలపై సుమన్​ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఉన్న లీడర్లను, కేడర్​ను కాపాడుకునేందుకు విచ్చలవిడిగా పైసలు వెదజల్లుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 

రామకృష్ణాపూర్​లో కేటీఆర్​మీటింగ్, మందమర్రిలో కేసీఆర్​ మీటింగ్​ నిర్వహించినా మైలేజీ రాలేదు. ఈనెల 27న చెన్నూర్​లో కేటీఆర్​ మీటింగ్, 28న బైక్​ ర్యాలీ ఏర్పాటు చేసినా బూస్టింగ్​ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే మందమర్రి మండలంలో పలుచోట్ల నిరసనలు ఎదురుకావడంతో గ్రామాల్లోకి ప్రచారానికి పోవడానికి జంకుతున్నారు. చివరి రెండు రోజులు పోల్​ మేనేజ్​మెంట్​పైనే బాల్క సుమన్​ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

కారు దిగిన క్యాడర్​..

నియోజకవర్గంతో కాకా వెంకటస్వామి ఫ్యామిలీకి 60  ఏండ్ల అనుబంధం ఉంది. వివేక్​కు పదవులు లేకపోయినా తొమ్మిదేండ్లుగా ప్రజల మధ్యలోనే ఉన్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలపై పోరాటాలు చేయడమే గాకుండా విశాక ట్రస్ట్​, కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. దీంతో ఆయనకు కాంగ్రెస్​ టికెట్​ ప్రకటించగానే వివిధ పార్టీల్లో ఉన్న అనుచరులు, అభిమానులు హస్తం గూటికి చేరుకున్నారు. 

సుమన్ ​అనుచరుల ఆగడాలను మౌనంగా భరిస్తున్న వారికి వివేక్​ కొండంత అండలా కనిపించారు.  బీఆర్ఎస్​లోని అససమ్మతివాదులు, అసంతృప్తి నేతలు కాంగ్రెస్​కండువా కప్పుకున్నారు. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం, మందమర్రి మండలాలకు చెందిన వందలాది లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు కారు దిగారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది.