అగ్రికల్చర్ అండ్‌‌ ఫార్మసీలో 87.82%.. ఇంజినీరింగ్‌‌లో 73.26% క్వాలిఫై

అగ్రికల్చర్ అండ్‌‌ ఫార్మసీలో 87.82%.. ఇంజినీరింగ్‌‌లో 73.26% క్వాలిఫై
  • ఎప్‌‌సెట్‌‌ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • గతంతో పోలిస్తే తగ్గిన పాస్ పర్సంటేజీ.. త్వరలోనే అడ్మిషన్ షెడ్యూల్ 

హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ రిజల్ట్స్‌‌ విడుదలయ్యాయి. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌లో 73.26 శాతం మంది అర్హత సాధించగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌లో 87.82 శాతం మంది క్వాలిఫై అయ్యారు. గతేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజీ స్వల్పంగా తగ్గింది. ఈ ఏడాది కూడా ఎప్ సెట్‌‌లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫలితాలు, ర్యాంకుల వివరాలను అధికారిక వెబ్‌‌సైట్ https://eapcet.tgche.ac.inలో పెట్టారు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఎప్ సెట్ ఎగ్జామ్స్ జరిగాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌కు 81,198, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌కు 2,07,190 మంది హాజరయ్యారు. ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసిన తర్వాత స్టూడెంట్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. 

ఇంజినీరింగ్ నుంచి 42 అబ్జెక్షన్లు రాగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌ నుంచి ఒక్కటీ రాలేదు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌లో 2,07,190 మంది పరీక్షలు రాయగా, 1,51,779 (73.26 %) మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌లో 81,198 మంది ఎగ్జామ్‌‌‌‌కు అటెండ్ కాగా, 71,309 ( 87.82%) అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, జేఎన్టీయూ వీసీ కిషన్ రెడ్డి, రెక్టర్ విజయకుమార్ రెడ్డి, కౌన్సిల్ వైస్ చైర్మన్ పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, ఎప్‌‌‌‌ సెట్ కన్వీనర్ దీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, త్వరలోనే ఎప్ సెట్ అడ్మిషన్ షెడ్యూల్‌‌‌‌ను రిలీజ్ చేస్తామని 
అధికారులు వెల్లడించారు. 

ఇంజినీరింగ్‌‌‌‌లో తగ్గుతున్న క్వాలిఫై పర్సంటేజీ..

ఎప్ సెట్ ఇంజినీరింగ్, అగ్రకల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌లో పాస్ పర్సంటేజీ గతేడాదితో పోలిస్తే తగ్గింది. ఇంజినీరింగ్‌‌‌‌లో వరుసగా నాలుగేండ్లుగా క్వాలిఫై పర్సంటేజీ తగ్గుతూ వస్తున్నది. 2022లో 80.42 శాతం మంది క్వాలిఫై కాగా, 2023లో 80.34 శాతం, 2024లో 74.98 శాతం, 2025లో 73.76 శాతానికి తగ్గింది. నాలుగేండ్లలో 6.66 శాతం సాస్‌‌‌‌ పర్సంటేజీ తగ్గిపోయింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌లో గతేడాది 89.67 శాతం మంది క్వాలిఫై అయితే.. ఈసారి 87.82 శాతానికి పడిపోయింది. 

ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌లో ఎస్సీలు 24,188 మంది, ఎస్టీలు 14,243 మంది క్వాలిఫై కాగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌లో ఎస్సీలు 20,208 మంది, ఎస్టీలు 11,252 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌‌‌‌లో బీసీ ఏలో 4,249 మంది, బీసీ బీలో 8,872, బీసీ సీలో 448 మంది, బీసీ డీలో 9,920 మంది, బీసీ ఈలో 8,727 మంది అర్హత సాధించగా, ఓసీలు 7,633 మంది క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌లో బీసీ ఏలో 9,817, బీసీ బీలో 29,816, బీసీ సీలో 654, బీసీ డీలో 27,060, బీసీ ఈలో 7,541, ఓసీలు 38,460 మంది అర్హత సాధించారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌లో.. 


జెండర్​           అటెండ్    క్వాలిఫైడ్    క్వాలిఫైడ్ 

అమ్మాయిలు    88,139    65,120         73.88
అబ్బాయిలు    1,19,051    86,659       72.79 
మొత్తం           2,07,190    1,51,779      73.26 

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో.. 


అమ్మాయిలు     61,331    54,166     88.32 
అబ్బాయిలు     19,867     17,143     86.29 
మొత్తం              81,198     71,309     87.82

టాప్ 5 ర్యాంకర్లు వీరే..


ఇంజినీరింగ్ స్ట్రీమ్.. 
1 పల్లా భరత్     ఆంధ్రప్రదేశ్‌‌‌‌
2 రామచరణ్ రెడ్డి     హైదరాబాద్ 
3 హేమసాయి సూర్య కార్తీక్     ఆంధ్రప్రదేశ్‌‌‌‌ 
4 లక్ష్మీభార్గవ్     హైదరాబాద్
5 ఎం.వెంకట గణేష్ రాయల్     హైదరాబాద్ 

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌లో

1 సాకేత్ రెడ్డి     హైదరాబాద్ 
2 సబ్బాని లలిత్ వరేణ్య     కరీంనగర్ 
3 చాడ అక్షిత్     వరంగల్ 
4 పెద్దింటి రాచల సాయినాథ్     వనపర్తి 
5 బ్రాహ్మిణి రెండ్ల     హైదరాబాద్