తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు ఇవే..

తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు ఇవే..
  • క్వార్టర్​పై రూ.10, హాఫ్​పై రూ.20, ఫుల్​ బాటిల్​పై రూ.40 హైక్​
  • మద్యం దుకాణాలకు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ సర్క్యులర్‌‌‌‌‌‌‌‌
  • నేటి నుంచే ధరలు అమల్లోకి
  • మళ్లీ స్పెషల్​ ఎక్సైజ్​ సెస్​ వడ్డింపు
  • ప్రతినెలా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను హైక్​ చేసింది. క్వార్టర్‌‌‌‌‌‌‌‌ మద్యం బాటిల్‌‌‌‌‌‌‌‌పై రూ.10, హాఫ్‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌పై రూ.20, ఫుల్‌‌‌‌‌‌‌‌బాటిల్‌‌‌‌‌‌‌‌పై రూ.40 పెంచింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ ఆదివారం సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది.  ఈ పెరిగిన లిక్కర్ ధరలు 2025 మే 19 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  అయితే. కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది.  2020లో అప్పటి ప్రభుత్వం.. తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టింది. 2023లో దీనిని రద్దు చేయగా.. ఇప్పుడు మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం పునరుద్ధరించింది.

 కొన్ని రకాల మద్యం బాటిల్స్​పై ఈసెస్‌‌‌‌‌‌‌‌ను పెట్టారు.  కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో  రాష్ట్రంలో  బీర్ల ధరలను ప్రభుత్వం 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. రిటైర్డ్  జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్​ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్  శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వం ముందు బీర్ల ధరలు, ఆ తర్వాత లిక్కర్​ రేట్లను పెంచినట్లు తెలుస్తున్నది.

సమ్మర్​ కంటే ముందు బీర్ల ధరలను, వేసవి ముగిసి వానాకాలం వస్తుండటంతో ఇప్పుడు  లిక్కర్​ రేట్లను పెంచింది. అప్పుడు బీర్ల సేల్స్​.. ఇప్పుడు లిక్కర్​ అమ్మకాలను పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది.   మద్యం ధరలు పెంచడంతో ప్రభుత్వానికి నెలకు యావరేజ్​గా రూ.500 కోట్ల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.