
హైదరాబాద్, వెలుగు: జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఆధార్ సిన్హా, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ శుక్రవారం సాయంత్రం పర్యవేక్షించారు. పబ్లిక్ గార్డెన్‌లో ఏర్పాట్లపై అధికారులతో ఆధార్ సిన్హా సమీక్షించారు. దాదాపు 5 వేల మంది వీక్షించేందుకు సీటింగ్ ఏర్పాట్లను చేశారు. ఎల్.ఇ.డి స్క్రీన్‌లు, మంచినీటి సౌకర్యం కల్పించారు. గన్ పార్క్ వద్ద ఏర్పాట్లను జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, అర్బన్ బయోడైవర్సిటీ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు. గన్‌పార్క్ లో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
జూన్2న తెలంగాణ డే వేడుకలు, ఇఫ్తార్ విందు సందర్భంగా సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గన్‌పార్క్, బషీర్‌బాగ్ ఏరియాల్లో నిఘా పెట్టారు. ఆదివారం ఉదయం 8 గంట ల నుంచి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయి.