విభిన్న ఆకృతులతో వినూత్న సాగు

విభిన్న ఆకృతులతో వినూత్న సాగు

నాగుల చిన్నగంగారం గ్రామానికి చెందిన రైతు చిన్నికృష్ణుడు విభిన్న ఆకృతుల్లో పంటలు సాగు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈసారి 30 రకాల దేశీ వరి నాట్లతో సుదర్శన చక్రం ఆకృతిని సృష్టించాడు. ఇప్పటికే 120 రకాల వరి వంగడాలను ఏర్పాటు చేయగా, తాజాగా 30 కొత్త రకాలతో కలిపి 150 రకాల వరి వంగడాలను పెంచుతున్నారు.  ఇటలీలో ప్రాచుర్యం పొందిన రిసొట్టో రకం వరిని పండించాడు. 

గతంలో తన తల్లిదండ్రుల ముఖాలను వరి పొలంలో చెక్కాడు.  జీ-20 లోగో, లింగం చుట్టూ ప్రదక్షిణ ఆకృతుల రూపంలో సాగు చేస్తూ గుర్తింపు పొందాడు. ఈసారి గోవింద్ భోగ్, గంగారూబీ రెడ్ రైస్, తోయిమల్లి, చమత్కార్, సోనా చూర్, రక్తశాలి, బహురూపి, నవార, వైట్ జాస్మిన్ బానుమతి, తిరునల్వేరి నాథన్, కళ్యాణి వైలెట్ లీఫ్, గంగాజపానిక్ రైస్ వంటి అనేక కొత్త రకాలతో నారుమడిని సుదర్శన చక్రం ఆకారంలో తీర్చిదిద్దడం విశేషం.
 -వెలుగు ఫోటోగ్రాఫర్, నిజామాబాద్