ధాన్యం ఆరబోతకు  రైతులకు తిప్పలు

ధాన్యం ఆరబోతకు  రైతులకు తిప్పలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  వరి కోతలు జోరందుకున్నాయి. కానీ, ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్మకానికి ముందు ఆరబోసేందుకు స్థలాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికొచ్చిన ప్రతీసారి గ్రామాల్లో కల్లాలు లేక వడ్లు రోడ్ల మీద ఎండబోసుకుంటూ అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కానీ, చాలా జిల్లాల్లో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కొన్ని జిల్లాల్లో ఏళ్ల తరబడి జాప్యం  జరుగుతోంది.  

పావు వంతు కూడా కట్టలే..

రైతులు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ సొంత వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాయ భూముల్లో  క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లాలు క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టుకుంటే నిధులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కల్లానికి రూ.56 వేల నుంచి రూ.84 వేల అంచనా వ్యయంతో మొత్తం 93 వేల 875 కల్లాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.750 కోట్లు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు 90 శాతం రాయితీ కల్పిస్తూ కల్లాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.  అయితే, రెండేండ్ల క్రితం రాష్ట్రంలో చేపట్టిన కల్లాల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు.  చాలాచోట్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. ఇప్పటి వరకు కేవలం 20 వేల 681 కల్లాలు మాత్రమే పూర్తయినట్లు సర్కారు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే సర్కారు నిర్మిస్తానని ప్రకటించిన దాంట్లో కనీసం పావు వంతు కూడా పూర్తి కాలేదు. 

రోడ్లే దిక్కు..

కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్ముకోవాలంటే తేమ శాతం 17 వచ్చేదాకా ఆరబెట్టాల్సి ఉంటుంది. అయితే, కల్లాలు లేక రైతులు ప్రతి వానాకాలం, యాసంగి వడ్లను రోడ్ల మీదే ఆర బోసుకునే పరిస్థితి నెలకొంటోంది. ఈ సమయంలో అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకొనేందుకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి నిలిచిపోయిన కల్లాలను వేగవంతంగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.