బీఆర్ఎస్ పాలనలో చేర్యాల విధ్వంసం : చైర్మన్ మెట్టు సాయికుమార్

బీఆర్ఎస్ పాలనలో చేర్యాల విధ్వంసం : చైర్మన్ మెట్టు సాయికుమార్

చేర్యాల, వెలుగు: బీఆర్ఎస్​ పాలనలో చేర్యాల పట్టణం విధ్వంసానికి గురైందని తెలంగాణ ఫిషర్ మెన్ కోఆపరేటివ్​ సొసైటీస్​ఫెడరేషన్ చైర్మన్​మెట్టు సాయికుమార్​ఆరోపించారు. ఆదివారం చేర్యాల పట్టణంలోని 2, 6వ వార్డుల్లో ఆయన మున్సిపల్​ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, పార్టీ 2వ వార్డు అభ్యర్థి ముస్త్యాల తేజ సంజీవులు, 6వ వార్డు అభ్యర్థి ముస్త్యాల కృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.