భీమదేవరపల్లి, వెలుగు: తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆవిర్భావ రాష్ట్ర సదస్సు ఈ నెల 28న కరీంనగర్‌లోని కళాభారతిలో నిర్వహిస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు అంబేద్కర్ కూడలిలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాశ్చంద్రబోస్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్ డాక్టర్ ఎదులాపురం తిరుపతి, బాలల హక్కుల ప్రజావేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి బైరి చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షురాలు గొల్లెన బాలమని తదితరులు పాల్గొన్నారు
