Sundeep Kishan Restaurant: హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ..వెలుగులోకి విస్తుపోయే నిజాలు

Sundeep Kishan Restaurant: హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ..వెలుగులోకి విస్తుపోయే నిజాలు

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని పలు హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పరిశుభ్రత పాటించని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఫుడ్ స్టోర్,క్యాలిటీ,నీట్ నెస్ విషయాల్లో  FSSAI గైడ్ లైన్స్ ఉల్లంఘింస్తున్నారనే  ఇప్పటికే పలు హాటల్స్‌కు నోటీసులు కూడా ఇచ్చారు.

తాజా విషయానికి వస్తే..టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ 'వివాహ భోజనంబు'అనే పేరుతో సికింద్రాబాద్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన విషయం తెల్సిందే.క్రమంలో సందీప్‌ కిషన్‌ హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.జులై 8న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు.

ఈ దాడులలో రెస్టారెంట్‌లో అనేక ఉల్లంఘనలు గుర్తించారు.ఈ తనిఖీ లలో హోటల్లో నాసరికం పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించడంతో హోటల్ పై కేసు నమోదు చేశారు.

గడువు ముగిసిన 25కేజీల చిట్టి ముత్యాలు బియ్యాన్ని పట్టుకున్నారు.నాణ్యత లేని ఈబియ్యంతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిసింది.(2022నాటికి బెస్ట్ బిఫోర్ డేట్‌తో కనుగొనబడింది).సింథటిక్ ఫుడ్ కలర్‌తో 500 గ్రాముల కొబ్బరి పొడి స్టాక్ పూర్తిగా  విస్మరించబడింది.

ALSO READ | చట్నీలో ఎలుకలు స్విమ్మింగ్ : JNTU ఇంజినీరింగ్ హాస్టల్ లో ఘోరం

అలాగే పైనుంచి సీల్ చేయబడిన కొన్ని ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. అయితే వాటికి సరైన లేబుల్స్ లేవు.వాటిని ఫ్రిజ్‌లో నిల్వచేసి కస్టమర్లకు వేడి చేసి ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. కిచెన్‌లోని డస్ట్‌బిన్లలో మూతలు కూడా సరిగ్గా లేకపోవటాన్ని అధికారులు గుర్తించారు.ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు.అంతేకాదు వంటగది ఆవరణలో కాలువ మాదిరి నీరు నిల్వ ఉండటం గమనించబడింది. 

ఆలాగే ఆహార పదార్థాల తయారీకి,కస్టమర్లకు అందించే నీటికి సంబంధించిన సరైన సర్టిఫికెట్లు కూడా లేకపోవటం తనిఖీల్లో బయటపడింది. ఈ మేరకు తెలంగాణ ఫుడ్ సెఫ్టీ అధికారులు ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. దీంతో ఇటువంటి రెస్టారెంట్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. 

ప్రస్తుతం సందీప్ కిషన్ అటు సినిమాలతో పాటు ఇటు రెస్టారెంట్ బిజినెస్‌లో అడుగుపెట్టి బిజీగా ఉన్నాడు.కానీ,నాణ్యమైన ఫుడ్ అందించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటూ ఓ వైపు ఫ్యాన్స్..నెటిజన్స్ కోరుతున్నారు.