హెల్త్ బులిటెన్ : కేసీఆర్ కోలుకోవటానికి 2 నెలలు

హెల్త్ బులిటెన్ : కేసీఆర్ కోలుకోవటానికి 2 నెలలు

మాజీ సీఎం కేసీఆర్,  బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితిపై యశోద హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.  కేసీఆర్ కోలుకోవటానికి కనీసంలో కనీసం 8 వారాలు పడుతుందని.. అంటే రెండు నెలల సమయం పడుతుందని హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది యశోద ఆస్పత్రి. కేసీఆర్ ఎడమ తుంటి విరిగిందని..దాన్ని రిప్లేస్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. బాత్రూంలో కేసీఆర్ గాయపడ్డట్లు తెలిపారు. 

 మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ హెల్త్  కండీషన్ పై ఆరాతీశారు. కేసీఆర్ ట్రీట్ మెంట్ కు సంబంధించి ట్రీట్ మెంట్ వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని హెల్త్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని  ఆదేశించారు.

డిసెంబర్ 7న అర్థరాత్రి కేసీఆర్ తన ఫాంహౌజ్ లోని బాత్రూంలో కాలు జారి పడ్డారు. దీంతో కాలుకి తీవ్ర గాయం అయ్యింది. అర్థరాత్రి 2 గంటల తర్వాత కేసీఆర్ ను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ కు ఎక్స్ రే, స్కానింగ్ తీసిన డాక్టర్లు కాలి తుంటి దగ్గర గాయం అయినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి ఆయనకు చికిత్స అందిస్తున్నామని..కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. మరోవైపు కేటీఆర్, కవిత, హరీశ్ రావు  యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు.