తెలంగాణ విద్యా విధానంపై 11 వర్కింగ్ కమిటీలు

తెలంగాణ విద్యా విధానంపై 11 వర్కింగ్ కమిటీలు
  • విద్యావేత్తలు, ఐఏఎస్​లు, వీసీలతో ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విద్యావిధానం రూపకల్పన కోసం పలు కమిటీలను సర్కారు ఏర్పాటు చేసింది. వివిధ అంశాలపై  స్టడీ రిపోర్టు ఇవ్వాలని 11 వర్కింగ్ కమిటీల ను నియమించింది. ఈ కమిటీలు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా సమగ్రమైన తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందించనున్నారు. కమిటీలకు బాధ్యులుగా ఐఏఎస్​లు, వీసీలు, విద్యావేత్తలను నియమించారు.

 ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాయ్ లర్నింగ్ ఎన్విరాన్ మెంట్ అంశంపై  కన్వీనర్​గా ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని నియమించారు. ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ అంశానికి కన్వీనర్​గా టీజీసీహెచ్ఈ చైర్మన్​ బాలకిష్టారెడ్డి, కరికులమ్, పెడగోజీ కల్చర్ అండ్ వ్యాల్యూ స్ ఎడ్యుకేషన్, గవర్నెన్స్, అకౌంటెబిలిటీ అంశాలకు రిటైర్డ్ ఐఏఎస్​ ఐవీ సుబ్బారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పై జేఎన్టీయూ వీసీ టీకేకే రెడ్డి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఎర్లీ చైల్డ్ వుడ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లెర్నింగ్​పై రిటైర్డ్ ఐఏఎస్​ రంజీవ్ ఆచార్య, ఈక్వాలిటీ, యాక్సెస్, స్టూడెంట్ సంక్షేమంపై ఓపెన్ వర్సి టీ వీసీ ఘంటా చక్రపాణిని కన్వీనర్లుగా నియమించారు.