కూకట్ పల్లి నుంచి మమత ఔట్?

కూకట్ పల్లి నుంచి మమత ఔట్?

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమతపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది. ఆమె ప్రస్తుతం కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్లేస్ లో జీహెచ్ఎంసీలో కొత్తగా రిపోర్ట్ చేసిన అభిలాషను నియమించే అవకాశం ఉందని సమాచారం. మమత 2010 నుంచి జీహెచ్ఎంసీలోనే పని చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక నేతలతో ఉన్న ర్యాపో కారణంగా ఆమె కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా కొనసాగారు. 

గతంలో జూబ్లీ హిల్స్ కు బదిలీ చేయగా 24 గంటల్లో శేరిలింగంపల్లి సర్కిల్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లిల్లో 2010నుంచి 2018 వరకు ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుంచి ఆమె కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా కొనసాగుతున్నారు.  ఆమె కొనసాగింపుపై అప్పట్లో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఆమెపై బదిలీ వేటు తప్పదని తెలుస్తోంది. మమతను ఎక్కడికి బదిలీ చేస్తారనేది రెండు మూడురోజుల్లో తేలిపోనుంది.