పాల్వంచ, వెలుగు : తెలంగాణ జెన్కో ఇంటర్ ప్రాజెక్టు క్రీడలు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలకు క్యారమ్స్, చెస్ ,టెన్నికాయిట్, టేబుల్ టెన్నిస్, షటిల్ క్రీడలు, పురుషులకు లాన్ టెన్నిస్ క్రీడలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, పోచం పాడు, విద్యుత్ సౌద, బీటీపీఎస్, కేటీపీఎస్ 5,6,7 దశల నుంచి 7 జట్లు ఈ క్రీడలకు హాజరయ్యాయి. క్రీడలను కేటీపీఎస్ 7వదశ చీఫ్ ఇంజినీర్ కే శ్రీనివాస్ బాబు, 5,6 దశల చీఫ్ ఇంజినీర్ మేక ప్రభాకర్ రావు ప్రారం భించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస బాబు మాట్లాడుతూ జెన్కో క్రీడల కు అధిక ప్రాధాన్యమిస్తుందని, మహిళలకు క్రీడల్లో పెద్ద పీట వేస్తోందన్నారు. ఈ గేమ్స్‌ను కేటీపీఎస్ 7 వ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నా రు. ఈ కార్యక్రమంలో జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహితానంద్, ఎస్ ఈ లు రాజ్ కుమార్, యుగపతి, జి.శ్రీనివాస్, నాగరాజు , స్పో ర్ట్స్ సెక్రటరీలు మహేశ్, వీరస్వా మి, కల్తి నరసింహా రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
