ఉప సర్పంచ్‌‌‌‌ల చెక్ పవర్ రద్దు చేయొద్దు..తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్‌‌‌‌ల సంఘం డిమాండ్

ఉప సర్పంచ్‌‌‌‌ల చెక్ పవర్ రద్దు చేయొద్దు..తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్‌‌‌‌ల సంఘం డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌‌‌‌లకు ఉన్న చెక్ పవర్‌‌‌‌ను రద్దు చేయవద్దని తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్‌‌‌‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ సురేశ్​నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌లో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రవ్యాప్తంగా తండా గ్రామ పంచాయతీల్లో సుమారు 1,250 మంది ఉప సర్పంచ్‌‌‌‌లు గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఉప సర్పంచ్‌‌‌‌ల హక్కులను పరిరక్షించాలని కోరారు. 

ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి చెక్ పవర్‌‌‌‌ను తొలగించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉప సర్పంచ్‌‌‌‌లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులే అధికంగా ఉన్నారని, బడుగు బలహీన వర్గాల హక్కులను ప్రభుత్వం కాపాడాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు భూక్య భావుసింగ్, భూక్య జయంత్‌‌‌‌లాల్ పాల్గొన్నారు.