త్వరలోనే ‘కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్’

త్వరలోనే ‘కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్’

హనుమకొండ: గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ‘కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మంగళవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారని, ఇప్పుడు అలాంటి ఓ మంచి పథకాన్ని వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 9 జిల్లాల్లోని గర్భిణీ స్త్రీలు, బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, ఈ లోపాన్ని నివారించేందుకు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లను అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కిట్ల ద్వారా ప్రతి సంవత్సరం లక్షా ఇరవై వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం:

మన మిసైల్ వ్యవస్థ పూర్తిగా సేఫ్

ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు 

రష్యాలో ఫైజర్ పెట్టుబడులు బంద్