
ఉక్రెయిన్ పై పోరుతో అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై 2,700లకు పైగా ఆంక్షలు విధించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది. తాజాగా.. ఉక్రెయిన్ పై రష్యా దాడులతో అమెరికాకు చెందిన ప్రముఖ మెడిసిన్ కంపెనీ ఫైజర్ కీలక ప్రకటన చేసింది. రష్యాలో కొత్తగా క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించబోమని, జరుగుతున్న ట్రయల్స్ కోసం ఎవర్నీ నియమించుకోబోమని... స్పష్టం చేసింది. రష్యాలో పెట్టుబడులు నిలిపివేస్తున్నట్లు ఫైజర్ తెలిపింది. కానీ హ్యుమానిటీతో.. రష్యాకు మెడిసిన్ సప్లై చేస్తామంది. రష్యా యూనిట్ నుంచి వచ్చే లాభాలన్నింటినీ ఉక్రెయిన్ ప్రజల సాయం కోసం విరాళంగా ఇస్తామని తెలిపింది. అక్కడ కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ ను రష్యా బయట నిర్వహించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఇతర రెగ్యులేటర్ సంస్థలతో కలిసి పని చేస్తామని పేర్కొంది.