
మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు చాలామంది. దీనివల్ల శరీరభాగాలపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందులో ఈ మధ్య ఎక్కువగా వస్తున్న హెల్త్ సమస్యల్లో ఒకటి కిడ్నీ ప్రాబ్లమ్. మంచి డైట్ తింటే ఈ ప్రాబ్లమ్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.
కిడ్నీ ప్రాబ్లమ్ ఎలా వస్తుందంటే... తిన్న ఫుడ్ అరిగాక అందులో నుండి వచ్చిన లిక్విడ్ వేస్ట్‌ను బయటికి పంపిస్తాయి కిడ్నీలు. మంచి ఫుడ్ తినకపోవడం వల్ల ఈ ఫిల్టర్ ప్రాసెస్ సరిగ్గా జరగక కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అందుకని తినే ఫుడ్‌లో సోడియం, ఫాస్ఫరస్, ప్రొటీన్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. హెల్దీ కిడ్నీ కోసం మంచి ఫుడ్ కావాలంటే...
బ్లూ బెర్రీస్
బ్లూ బెర్రీస్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువ ఉంటాయి. ఇవి తింటే క్యాన్సర్, డయా బెటిస్, హార్ట్ డిసీజ్, కాగ్నిటివ్ డిక్లైన్ అంటే ఙ్ఞాపక శక్తి తగ్గడం, కిడ్నీ సమస్యలు రావు.
రెడ్ గ్రేప్స్
రెడ్ గ్రేప్స్‌లో ఎక్కువగా విటమిన్–సి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కిడ్నీ ప్రాబ్లమ్ వల్ల వచ్చే వాపును తగ్గిస్తాయి. డయాబెటిస్, మతి మరుపు రాకుండా ఉంటుంది. వీటిని తింటే మంచి డైజెషన్ కూడా.
ఎగ్ వైట్స్
కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు ఎగ్ వైట్ బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో శరీరానికి కావాల్సినంత విటమిన్– కె, సి, బి లు ఉన్నాయి. ఫాస్ఫరస్ తక్కువగా ఉంటుంది. డయాలిసిస్ చేయించుకునే వాళ్లకు ఎగ్ వైట్ మంచి సొల్యూషన్.
టర్నిప్స్
ఇది ఒక వేరు. టర్నిప్‌ను తెలుగులో నూల్ కోల్ దుంప, ఎర్ర ముల్లంగి అని పిలుస్తారు. ఈ దుంపను కూరల్లో వాడతారు. ఇందులో ఎక్కువగా ఫైబర్, విటమిన్– సి ఉంటాయి. దీన్ని కాల్చి, ఉడికించి రకరకాలుగా తింటుంటారు. డైట్ చేయాలనుకునే వాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది.
ఉల్లి
భారతీయ వంటల్లో కామన్ ఐటమ్ ఉల్లిగడ్డ. ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడు తుంది. ఇందులో ఎక్కువగా విటమిన్–సి, మాంగనీస్, విటమిన్–బి, ప్రి–బయోటిక్ ఫైబర్ ఉంటాయి. ఇవి డైజెస్టివ్ సిస్టమ్‌ను బాగుండేలా చూస్తాయి.
పైనాపిల్
పైనాపిల్ కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తుంది. ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఫైబర్, మాంగనీస్, విటమిన్– సి ఎక్కువగా ఉంటాయి. వాపులు, నొప్పులు ఉన్నవాళ్లు పైనాపిల్ తింటే అవి తగ్గుతాయి.
క్యాప్సికం
ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్, విటమిన్– సి క్యాప్సికంలో ఉంటాయి. కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు ఇవి తినాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ పెరిగి, తొందరగా కోలుకుంటారు.