కెనడా స్కూల్ లో కాల్పులు.. 10మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

కెనడా స్కూల్ లో కాల్పులు.. 10మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

కెనడాలోని ఓ స్కూల్ లో దారుణ ఘటన జరిగింది. స్కూల్ విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ కాల్పుల్లో 10మంది విద్యార్ధులు అక్కడికక్కడే చనిపోయారు. 20మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం(ఫిబ్రవరి 11) కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. కాల్పుల అనంతరం తనను తాను షూట్ చేసుకొని నిందితుడు చనిపోయినట్లు  కెనడా పోలీసులు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియలేదు. టంబ్లర్ రిడ్జ్ స్కూల్  మొత్తం 175 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కెనడాలో పాఠశాలల్లో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి. 

బ్రిటిష్ కొలంబియాలో జరిగిన టంబ్లర్ రిడ్జ్ కాల్పుల ఘటనను కెనడా ప్రధాని మార్క్ కార్నీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భయంకర ఘటనగా అభివర్ణించారు. కాల్పుల్లో చనిపోయిన బాధితులకు కుటుంబాలకు  సానుభూతి తెలిపారు. టంబ్లర్ రిడ్జ్‌లోని పాఠశాల కాల్పుల ఘటనతో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మ్యూనిచ్ భద్రతా సమావేశానికి వెళ్లాలని నిర్ణయించిన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.