కరోనా ఫెయిల్యూర్స్ పై సర్కార్ అలర్ట్.. ఆరోగ్యశాఖలో భారీ మార్పులు

కరోనా ఫెయిల్యూర్స్ పై సర్కార్ అలర్ట్.. ఆరోగ్యశాఖలో భారీ మార్పులు
  • స్పెషల్​ సీఎస్​ శాంతికుమారి అటవీ శాఖకు
  • హెల్త్​ సెక్రటరీగా సయ్యద్​ ముర్తజా రిజ్వీ
  • ఫ్యామిలీ హెల్త్‌ కమిషనర్ యోగితా రాణా ఎస్సీ డెవలప్​మెంట్​కు
  • మళ్లీ ఫ్యామిలీ హెల్త్​ కమిషనర్​గా వాకాటి కరుణ
  • వీరితో పాటు మరో 13 మంది ఐఏఎస్​ల ట్రాన్స్​ఫర్​

ఒ కవైపు వేలల్లో పెరిగిపోతున్న కరోనా కేసులు.. మరోవైపు సర్కార్​ ఫెయిల్యూర్స్​పై ప్రతిపక్షాల విమర్శలు, హైకోర్టు చీవాట్లు.. వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు రెడీ అయింది. ఇందులో భాగంగా హెల్త్​ డిపార్ట్​మెంట్​లోని ఇద్దరు ఐఏఎస్​ ఆఫీసర్లపై బదిలీ వేటు వేసింది. కీలకమైన హెల్త్​ స్పెషల్​ సీఎస్​ శాంతికుమారిని, పబ్లిక్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ యోగితారాణాను ట్రాన్స్​ఫర్​ చేసింది. శాంతికుమారిని అటవీ శాఖకు, యోగితారాణాను ఎస్సీ డెలవప్‌మెంట్‌కు బదిలీ చేసింది.  తెలంగాణ భవన్ (ఢిల్లీ)​ ఓఎస్డీగా ఉన్న సయ్యద్​ముర్తజా రిజ్వీకి హెల్త్​ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. రిజ్వికి ఆరోగ్యశ్రీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో పబ్లిక్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌గా పని చేసిన వాకాటి కరుణకు తిరిగే అదే స్థానం కల్పించింది.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్​లో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. హెల్త్​ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ శాంతికుమారితో పాటు ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ యోగితారాణాను ట్రాన్స్​ఫర్​ చేసింది. శాంతికుమారి స్థానంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌ ఓఎస్డీ ముర్తజా రిజ్వికి హెల్త్‌‌‌‌ సెక్రటరీగా పోస్టింగ్‌‌‌‌ ఇచ్చింది. రిజ్వికి ఆరోగ్యశ్రీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో పబ్లిక్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌గా పని చేసిన వాకాటి కరుణకు తిరిగే అదే స్థానం కల్పించింది. సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ పోస్టును భర్తీ చేయడంతో పాటు ఏపీ నుంచి డిప్యూటేషన్‌‌‌‌పై వచ్చిన టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజుకు కీలక స్థానం కట్టబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం 15 మంది ఐఏఎస్‌‌‌‌ అధికారులను ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌  చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఐఏఎస్‌‌‌‌ల ట్రాన్స్‌‌‌‌ఫర్లలో సీఎస్‌‌‌‌ సోమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ ముద్ర స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ చీఫ్‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌ రాజీవ్‌‌‌‌శర్మ వర్గానికి చుక్కెదురైంది.

ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ఇంటెలిజెన్స్​ రిపోర్టు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు ప్రభుత్వంపై నెగెటివ్ అభిప్రాయానికి వచ్చినట్టు ఇంటెలిజెన్స్​ వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. గ్రేటర్ లో వైరస్ నియంత్రణ కోసం సరైన చర్యలు తీసుకోలేదన్న అసహనంలో ప్రజలు ఉన్నట్టు ఇంటెలిజెన్స్​ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. ఇలాగే వదిలేస్తే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉందని సూచించినట్టు తెలిసింది. దీంతోనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు సమాచారం. త్వరలో మంత్రులతో ఓ కమిటీని వేయాలని కూడా ఆలోచిస్తోంది.

ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్​                      ప్రస్తుత స్థానం                                    బదిలీ అయిన స్థానం

జ్యోతి బుద్ధప్రకాశ్‌‌‌‌                       వెయిటింగ్‌‌‌‌                                           అడిషనల్‌‌‌‌ సీఈవో

రాణి కుమిదిని                           వెయిటింగ్‌‌‌‌                                            స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌, లేబర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌

సయ్యద్‌‌‌‌ ముర్తజా రిజ్వి               ఓఎస్డీ, తెలంగాణ భవన్‌‌‌‌ (ఢిల్లీ)             సెక్రటరీ, హెల్త్‌‌‌‌

శాంతికుమారి                            స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌, హెల్త్‌‌‌‌                            స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌, ఫారెస్ట్‌‌‌‌

రజత్‌‌‌‌కుమార్‌‌‌‌                             సెక్రటరీ, ఇరిగేషన్‌‌‌‌                               సెక్రటరీ, సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టెక్నాలజీ (ఎఫ్‌‌‌‌ఏసీ)

అధర్​సిన్హా                                వెయిటింగ్​                                             డైరెక్టర్​ జనరల్​ (ఈపీటీఆర్​ఐ)

ఎల్‌‌‌‌. శర్మన్‌‌‌‌                                అడిషనల్‌‌‌‌ సెక్రటరీ (ఎంఏయూడీ)        కలెక్టర్‌‌‌‌ నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌

ఎ.శ్రీదేవసేన                             కలెక్టర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌                               డైరెక్టర్‌‌‌‌, స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌

వాకాటి కరుణ                            వెయిటింగ్‌‌‌‌                                            కమిషనర్‌‌‌‌, పబ్లిక్‌‌‌‌ హెల్త్‌‌‌‌

శ్రీనివాసరాజు                            వెయిటింగ్‌‌‌‌                                            సెక్రటరీ, టూరిజం, కల్చర్‌‌‌‌

టి. విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌                    వెయిటింగ్‌‌‌‌                                            స్పెషల్‌‌‌‌ సెక్రటరీ, ఎస్సీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌

యోగితారాణా                           కమిషనర్‌‌‌‌, పబ్లిక్‌‌‌‌ హెల్త్‌‌‌‌                           కమిషనర్‌‌‌‌, ఎస్సీ డెలవప్‌‌‌‌మెంట్‌‌‌‌

సిక్తా పట్నాయక్‌‌‌‌                       కలెక్టర్‌‌‌‌, పెద్దపల్లి                                     కలెక్టర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌

భారతి హోలికేరి                     కలెక్టర్‌‌‌‌, మంచిర్యాల                               కలెక్టర్‌‌‌‌, పెద్దపల్లి (ఎఫ్‌‌‌‌ఏసీ)

శ్రీధర్‌‌‌‌                                      వెయిటింగ్‌‌‌‌                                             స్పెషల్‌‌‌‌ సెక్రటరీ, ట్రైబల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌

 

గాంధీలో మరో దారుణం..ఆక్సీజన్ ఇవ్వకపోవడంతో కరోనా పేషెంట్ మృతి