పసుపు బోర్డ్​కు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ ఎలాట్​

పసుపు బోర్డ్​కు  ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ ఎలాట్​
  • గవర్నమెంట్​ ఆర్డర్స్​ జారీ

నిజామాబాద్​, వెలుగు: నేషనల్​ పసుపు బోర్డు ఆఫీస్​ కోసం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ బిల్డింగ్​ను స్టేట్ గవర్నమెంట్​ కేటాయించింది. బిల్డింగ్ విస్తీర్ణం 4,052 చదరపు ఫీట్లుండగా ప్రతి ఫీట్​కు రూ.13 చొప్పున నెలకు రూ.52,676 అద్దె చెల్లించాలని ఆర్అండ్​బీ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ వికాస్​రాజ్​ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత బీఆర్ఎస్​ గవర్నమెంట్ రాష్ట్రంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాదిరి రూరల్​ సెగ్మెంట్​లో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ నిర్మించింది. 

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తన క్యాంప్​ ఆఫీస్​ను సొంతగా ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదిన్నర నుంచి ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని కిరాయిపై పసుపు బోర్డుకు కేటాయించాలని ఎంపీ అర్వింద్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రసుతం పసుపు బోర్డు ఆఫీస్​ సిటీలోని ఆర్యనగర్​లో ఒక చిన్న రూమ్​లో నడుస్తున్నది.