- రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ఆయిల్‌పామ్ రైతులకు చెల్లించే గెలల ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫార్ములాను ఖరారు చేసింది. 2026–-27 ఆయిల్ ఇయర్‌కు సంబంధించి ఈ విధానం నవంబర్ 1, 2026 నుంచి 2027 అక్టోబర్ 31 వరకు అమల్లో ఉండనుంది. ఈ మేరకు వ్యవసాయ, సహకార (హార్టికల్చర్) శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ సోమవారం జీవో జారీ చేశారు. కొత్త ఫార్ములా ప్రకారం క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ నట్ ధరల ఆధారంగా గెలల ధరను నిర్ణయిస్తారు.
నికర క్రూడ్ పామ్ ఆయిల్ వెయిటెడ్ యావరేజ్ ధరలో 14.76 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. 2025–-26 ఆయిల్ ఇయర్లో అప్పారావుపేట ఫ్యాక్టరీలో టీజీ ఆయిల్‌ఫెడ్ సాధించిన 19.62 శాతం సగటు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియోను దీనికి ప్రాతిపదికగా తీసుకుంటారు. అలాగే పామ్ నట్ రికవరీకి సంబంధించి 10.10 శాతం వెయిటెడ్ యావరేజ్ ధరలో 75.25 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రెండు అంశాల ఆధారంగా రైతులకు చెల్లించాల్సిన గెలల ధరను ఖరారు చేస్తారు. కొత్త విధానానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
