జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీ : టీజేఈయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి

జలమండలిలో  735 కొత్త పోస్టుల భర్తీ :  టీజేఈయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి
  • ప్రభుత్వం అంగీకరించిందన్న టీజేఈయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి 

సైఫాబాద్, వెలుగు: జలమండలిలో 735 కొత్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్​ యూనియన్​ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సైఫాబాద్‌‌లోని ఖైరతాబాద్ జలమండలి కేంద్ర కార్యాలయంలో ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, ఎండీ అశోక్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక కార్మిక సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. తాజా నియామకాలు తొలి విజయమని, దీని ద్వారా ప్రమోషన్ల అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.  ఈ కార్యక్రమంలో టీజేఈయూ  అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రావణ్​ కుమార్, మేవ ప్రధాన కార్యదర్శి సయ్యిద్ అక్తర్ అలీ, నేతలు ఆనంద్ రెడ్డి, సి. రాజు, సిహెచ్. ప్రవీణ్ కుమార్, మజారుద్దీన్, తిరుపతి, బి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.