
తెలంగాణ రాష్ట్రంలోనూ దీపావళి సెలవును 13వ తేదీగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీపావళి అమావాస్య ఘడియలు రెండు రోజులుగా వచ్చాయి. 12వ తేదీ మధ్యాహ్నం నుంచి 13వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంది. ఈ క్రమంలోనే పండుగ జరుపుకునే తేదీ, సెలవుపై గందరగోళం నెలకొంది. రాత్రిపూట జరిగే పండుగ కావటంతో.. 12వ తేదీ ఆదివారమే అని కొందరు.. కాదు సూర్యోదయంతో మొదలయ్యే సోమవారం 13వ తేదీని అని కొందరు జరుపుకుంటున్నారు.
ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీగా ఉన్న సెలవు దినాన్ని.. 13వ తేదీ సోమవారానికి మార్చటం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సోమవారం 13వ తేదీన దీపావళి సెలవు ప్రకటిస్తూ.. కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఏపీ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు తెలంగాణ హైకోర్టు సైతం ఇదే విధంగా సెలవు దినాన్ని మార్చటం జరిగింది. ఇప్పుడు తెలంగాణలోనూ సోమవారం, 13వ తేదీ దీపావళి సెలవు..