మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్

 మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం  :  ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్

కురవి, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధే సర్కారు లక్ష్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. మంగళవారం కురవి మండల కేంద్రంలోని  ఓ ఫంక్షన్ హాల్​లో కురవి, సిరోల్ మండలాల్లోని 664 మహిళా సంఘాల సభ్యులకు రూ.48.89 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులు, రూ.4.80 కోట్ల స్త్రీనిధి రుణాలు, డోర్నకల్ నియోజకవర్గంలోని గ్రూపులకు రూ.2.46 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు. అయ్యగారిపల్లి, కురవిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.   

మహిళల అభివృద్ధికే వడ్డీ లేని రుణాలు

జనగామ అర్బన్: మహిళల ఆర్థికాభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తోందని ఎంపీ కడియం కావ్య అన్నారు. స్టేషన్​ఘన్​పూర్​లోని ఎస్​ కన్వెన్షన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్ తో కలిసి మహిళా సంఘాల సభ్యులకు రూ.17.36 కోట్ల విలువైన రుణాల చెక్కును అందజేశారు.  

కాంగ్రెస్ ​కొనసాగించడం అభినందనీయం  

మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని గత బీఆర్​ఎస్ ​ప్రభుత్వం ప్రారంభించగా.. కాంగ్రెస్ ​కొనసాగించడం అభినందనీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. జనగామ మున్సిపల్​ ఆఫీస్​లో మంగళవారం మహిళా సంఘాల సభ్యులకు రూ.8.89 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు అందజేశారు.  

ప్రభుత్వానికి ఆడబిడ్డల దీవెనలు ఉండాలి  

మొగుళ్లపల్లి : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆడబిడ్డల దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.  కలెక్టర్​రాహుల్​శర్మతో కలిసి మొగుళ్లపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో 5 మండలాల మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.2.48 కోట్ల విలువైన చెక్కు అందించారు.  

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ములుగు : ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో 9 మండలాల స్వయం సహాయక సంఘాలకు రూ.2.26 కోట్ల రుణాల చెక్కును అందించారు.   

వర్ధన్నపేట ఎమ్మెల్యే కార్యాలయంలో..

వర్ధన్నపేట, వెలుగు: వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హసన్ పర్తి మండలాల్లోని మహిళా సంఘాలకు ఎమ్మెల్యే నాగరాజు మంగళవారం వర్ధన్నపేటలోని క్యాంప్​ఆఫీస్​లో రూ.2.18 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు అందజేశారు. కలెక్టర్ సత్యశారద తదితరులు పాల్గొన్నారు.