వర్షాలపై వార్ రూమ్ నంబర్ 9030227324

వర్షాలపై వార్ రూమ్ నంబర్ 9030227324

రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.  ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రోజులో 24 గంటలపాటు పనిచేయనున్న ఈ వార్ రూమ్ ద్వారా సహాయం పొందదల్చిన వారు 90302 27324, 040 24651119 నంబర్లకు కాల్ చేయొచ్చని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో జిల్లా, డివిజన్ స్థాయుల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల సహాయార్ధం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల వైద్య యంత్రాంగాలకు నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  ఇవాళ మంచిర్యాల జిల్లాలో  ఏర్పాటు చేసిన 88 వైద్య శిబిరాల్లో అత్యధికంగా 4,608 మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 118 వైద్య శిబిరాల్లో 2,479 మందికి  వైద్య చికిత్సలు అందించారు.