ఇందిరమ్మ బాటలో ప్రజా ప్రభుత్వం : కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్

ఇందిరమ్మ బాటలో ప్రజా ప్రభుత్వం : కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్
  • గాంధీ భవన్​లో ఇందిరా గాంధీ వర్ధంతి 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ బాటలోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నడుస్తోందని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 31 అంటే మహా నేతలను స్మరించుకునే రోజు అని అన్నారు. శనివారం గాంధీ భవన్ లో ఇందిరాగాంధీ వర్ధంతి, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు మధుయాష్కీతోపాటు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఇందిరాగాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.