తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీం కోర్టులో ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీం కోర్టులో ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. గ్రూప్‌1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకోలేమని గురువారం (అక్టోబర్ 09) స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. 

గ్రూప్ 1 ర్యాంకర్ల నియాకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును ముల అనుష్  అనే వ్యక్తి సుప్రీంలో సవాలు చేయగా.. విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఇప్పటికే రెండ్రోజుల క్రితం ఇదే కేసులో, మరో పిటిషన్ విచారించిన కోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

 హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నియామకాలు జరగాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్ట్ డివిజన్ బెంచ్ ముందు అక్టోబర్ 15న విచారణ ఉండగా.. ఈ దశలోచేసుకోలేమని తేల్చిచెప్పింది.