పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌ : వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేయనున్నట్టు తెలిపింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలంటూ హైకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది సర్కారు. స్లాట్ బుకింగ్ చేసుకున్నాక.. పాత పద్ధతిలోనే మిగతా విధానం అంతా కొనసాగుతోందని గతంలో కోర్టుకు చెప్పింది ప్రభుత్వం. దీనిపైనా హైకోర్టు సీరియస్ అయ్యింది. రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రజల పర్సనల్ డీటేల్స్ తీసుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్రంలో నాన్ అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నట్టు శ‌నివారం ఉదయం ప్రకటించింది ప్రభుత్వం. మళ్లీ సాయంత్రానికి తమ నిర్ణయం మార్చుకుంది. సోమవారం నుంచి పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని చెప్పింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని ఉంటే.. ఆ షెడ్యూల్ ప్రకారమే వారికి రిజిస్ట్రేషన్ ఉంటుందని తెలిపింది.