హెచ్సీయూ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్

 హెచ్సీయూ  పరీక్షల్లో మాల్ప్రాక్టీస్
  • మైక్రో ఫోన్స్​తో పట్టుబడ్డ ఇద్దరు

గచ్చిబౌలి, వెలుగు : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్​సీయూ)లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నాన్ టీచింగ్ రిక్రూట్‌‌‌‌మెంట్ పరీక్షలో మాల్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ కు పాల్పడిన ఇద్దరు అభ్యర్థులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 21న నిర్వహించిన పరీక్షలో హర్యానాకు చెందిన అనిల్ కుమార్, సతీశ్ మొబైల్ ఫోన్, బ్లూటూత్ ఇయర్‌‌‌‌ ఫోన్స్, మైక్రో ఫోన్స్ సాయంతో పరీక్ష రాస్తున్నట్లు ఇన్విజిలేటర్లు గుర్తించారు. 

దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్ దివేశ్ నిగంకు సమాచారం అందించగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు మాల్‌‌‌‌ ప్రాక్టీస్​కు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇన్​స్పెక్టర్ బాలరాజు తెలిపారు.