
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా 13 రోజుల పాటు ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్ సహా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.
అక్టోబర్ 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ను అకడమిక్ క్యాలెండర్లో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు మాత్రం ఈ నెల 28 నుంచి వచ్చేనెల 5 వరకూ దసరా హాలిడేస్ ఉంటాయి.