మంజీరాలో వైల్డ్ లైఫ్ సాంక్చురీ!..ఎకో టూరిజంపై సర్కార్ ఫోకస్

మంజీరాలో వైల్డ్ లైఫ్ సాంక్చురీ!..ఎకో టూరిజంపై సర్కార్ ఫోకస్
  •     తొలుత అనంతగిరి, కనకగిరి డెవలప్​మెంట్
  •     కాటేజీల నిర్మాణం, ట్రెక్కింగ్ పార్క్ ఏర్పాటు దిశగా చర్యలు
  •     ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రకృతి, స్థానిక సంస్కృతిని పరిరక్షిస్తూ.. పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి చేపట్టనున్నది. ఎకో టూరిజం ద్వారా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సర్కారు భావిస్తున్నది. ఇందులో భాగంగా అధికారులు ఇప్పటికే రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలు, జల పాతాలు, జీవ వైవిధ్య ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన వారసత్వ సంపదకు అద్దంపట్టే ప్రదేశాలను గుర్తించారు. తొలుత అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరు పర్యాటక ప్రాంతాల్లో ఎకో టూరిజం డెవలప్​మెంట్ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మంజీరాలో వైల్డ్ లైఫ్ సాంక్చరీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంజీరా అభయారణ్యంలో 303 రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దాదాపు 117 రకాల కంటే ఎక్కువగానే వలస పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. 14 జాతుల ఉభయచరాలు ఇక్కడ సంచరిస్తున్నాయి. 57 రకాల జాతుల చేపలు మంజీరా నదిలో జీవిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 32 రకాల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ అభయారణ్యాన్ని సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రేమికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ ప్రాంతంలో పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా వసతులు కల్పించనున్నది.

64 ఎకో టూరిజం స్పాట్లు గుర్తింపు

వన్యప్రాణులు, విదేశీ పక్షులు వలసవచ్చే జీవవైవిధ్య ప్రాంతాలు, సంస్కృతి, సంప్రదాయాలకు, చారిత్రక ఆనవాళ్లకు నెలవైన ప్రదేశాల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 సర్క్యూట్లలో 64 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించారు. అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిక్రియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మరికొన్ని ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా ట్రెక్కింగ్ పార్కులు, సఫారీ ట్రాక్‌లు, వాచ్ టవర్లు ఏర్పాటు చేయనున్నారు. 

కాటేజీల నిర్మాణానికి ప్రణాళికలు

అనంతగిరి, కనకగిరి, నందిపేట, మన్ననూరు వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో వసతులను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఎకో కాటేజీల నిర్మాణం, ట్రెక్కింగ్ పార్క్, సఫారీ ట్రాక్, వాచ్ టవర్ నిర్మాణలు చేపట్టనున్నది. అనంతగిరిలో 8, మన్ననూర్​లో 14 కాటేజీలు నిర్మించనుండగా.. ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్నది. ఒక్కో ఎకో కాటేజ్ నిర్మాణానికి రూ.20 లక్షలు వెచ్చించనున్నారు. అంతేగాకుండా, ట్రెక్కింగ్ పార్క్, సఫరీ ట్రాక్ ప్రకృతి అందాలను ఒకచోట నుంచి వీక్షించేలా వాచ్ టవర్లు నిర్మించనున్నా రు. నిజామాబాద్ జిల్లా నందిపేటలోని ఉమ్మెడ, గాజపల్లి, బిలాస్​పూర్ సైట్లలో ఎకో టూరిజంలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.