డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ చేసుకునే అవకాశం

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ చేసుకునే అవకాశం

తెలంగాణలో టెట్‌లో అర్హత సాధించిన వారు డీఎస్సీకి చేసుకున్న దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. టెట్ మార్కులతో పాటు ఇతర వివరాలు ఎడిట్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నిన్న టెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫెయిల్ అయిన వారు డిసెంబర్‌లో జరిగే టెట్‌కు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చని వివరించింది.

టీజీ టెట్-2024కు ధరఖాస్తు 2 లక్షల 86  వేల 381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్-1 పరీక్షకు 85 వేల 996 అభ్యర్థులు హాజరుకాగా  57 వేల 725 అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1లక్షా 50 వేల 491 మంది అభ్యర్థులు హాజరుకాగా 51 వేల 443 మంది అర్హత సాధించారు.  పేపర్-1లో 67.13% పేపర్-2లో 34.18% అర్హత సాధించారు.