మేడారం భక్తుల స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మేడారం భక్తుల స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం మేడారంలో ప్రభుత్వం రూ.105 కోట్లతో భక్తులకు సౌలత్​లు కల్పిస్తున్నది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే జాతరకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో సర్కారు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఫిబ్రవరి21 నుంచి 24వ తేదీ వరకు జరిగే జాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా. 

భక్తుల స్నానాల కోసం బ్యాటరీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మేడారం వచ్చే భక్తులందరూ జంపన్నవాగులో స్నానం చేస్తారు. ఇందుకోసం వారం రోజుల పాటు  లక్నవరం నుంచి నీళ్లు వదలాలని నిర్ణయించారు.  నీళ్లల్లోకి దిగి స్నానాలు చేయలేని వారి కోసం జంపన్నవాగుకు రెండు వైపులా సుమారు 4 కి.మీ పొడవునా రూ.1.5 కోట్లతో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏర్పాటు చేసింది. రూ.50 లక్షలతో జంపన్నవాగులో నిర్మించిన బావుల పూడికతీత పనులు కూడా పూర్తికావచ్చాయి. మోటార్లు పనిచేయడానికి కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లతో పాటు జనరేటర్లను సైతం ఏర్పాటు చేశారు.  కాగా, జంపన్నవాగు వద్ద స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి 50కి పైగా టెంపరరీ రూములను ఏర్పాటుచేశారు. మేడారం జాతరలో బట్టలు మార్చుకునే గదులు సరిపోక గతంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఈసారి జంపన్నవాగు పొడవునా 4 కి.మీ దూరం రెండు వైపులా ప్రతి 20 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటు చేశారు. 

Also Read : మేడారం జాతరలో 11 చోట్ల ఫ్రీ వైఫై సేవలు