క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట.. బోడుప్పల్ లో 29వ జాతీయ కరాటే పోటీలు ప్రారంభం

క్రీడలకు తెలంగాణ  ప్రభుత్వం పెద్దపీట.. బోడుప్పల్ లో 29వ జాతీయ కరాటే పోటీలు ప్రారంభం
  • పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​

మేడిపల్లి, వెలుగు: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్​గౌడ్​అన్నారు. బోడుప్పల్​లోని ఓ గార్డెన్స్​లో విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 29వ జాతీయ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

కరాటేలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలని సూచించారు. కాంగ్రెస్​మేడ్చల్ నియోజకవర్గ ఇన్​చార్జి తోటకూర వజ్రేశ్​యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిశోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పద్మారెడ్డి, సీసా వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.