మొదటివారంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు

V6 Velugu Posted on Jan 24, 2022

నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు ఎంపీ అర్వింద్. మొదటి వారంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో సామాన్యులపై భారం మోపితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సోమవారం నిజామాబాద్ లో కలెక్టర్ నారాయణ రెడ్డిని కలసి వివిధ సమస్యలపై చర్చించి, వినతిపత్రం సమర్పించారు ఎంపీ అర్వింద్. తాళ్ళ రాంపూర్ సొసైటీ ఆస్తులు వేలం వేసి డిపాజిట్ దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

 

ఇవి కూడా చదవండి

 

 

Tagged Bjp, government, Telangana, Employees, NIzamabad, Salaries, MP Arvind, collector, financial crisis

Latest Videos

Subscribe Now

More News