తీరు మారలె.. కరోనా డెత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇప్పటికీ  దొంగ లెక్కలే

తీరు మారలె.. కరోనా డెత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇప్పటికీ  దొంగ లెక్కలే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరోనా మరణాలను తక్కువ చేసి చూపించడాన్ని రాష్ర్ట సర్కార్ ఇప్పటికీ మానుకోవడం లేదు. ఒక్క గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కరోనాతో ఆదివారం ముగ్గురు చనిపోయారు. కానీ ఒక్క డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నమోదు కాలేదని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేసింది. కొత్తగా 170 మంది కరోనా బారిన పడ్డారని బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. 34,200 మందికి టెస్టులు చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో68 మందికి, జిల్లాల్లో 102 మందికి పాజిటివ్ వచ్చినట్టు చెప్పింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,65,068కి చేరగా, ఇందులో 6,56,544 మంది కోలుకున్నట్టు తెలిపింది. 3,912 మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. 4,612 యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు ఉన్నాయని చెప్పింది.

కేంద్రం చెప్పినా..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల పరిహారం అందుతుందో లేదోనని కరోనా మృతుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికైనా మరణాల విషయంలో నిజాలు బయటపెట్టి, బాధితులకు నష్ట పరిహారం దక్కేలా చూడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా సోకినవాళ్లు ఎక్కడ మరణించినా, ఏ జబ్బుతో చనిపోయినా కరోనా డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే చూడాలని కేంద్ర ప్రభుత్వం గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా జారీ చేసింది. అయినా రాష్ట్ర సర్కారు ఆదివారం బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా మరణాలను దాచిపెట్టింది.