విద్యుత్ ఉద్యోగుల్లో ఆ 76 మందిని చేర్చుకుంటాం

విద్యుత్ ఉద్యోగుల్లో ఆ 76 మందిని చేర్చుకుంటాం
  • జస్టిస్​ ధర్మాధికారికి విద్యుత్​ సంస్థల రిపోర్టు

హైదరాబాద్, వెలుగు: రిలీవ్​ చేసిన ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల్లో జస్టిస్​ధర్మాధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న 76 మందిని చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ విద్యుత్​ సంస్థలు ప్రకటించాయి. ఈమేరకు ఉద్యోగుల వివరాలతో జస్టిస్ ​ధర్మాధికారికి నివేదిక అందజేశాయి.

మొత్తం 256 మంది ఉద్యోగులు తెలంగాణ విద్యుత్​ సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు కేవలం 76 మంది మాత్రమే అర్హులని, 180‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంది ఉద్యోగుల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేల్చారు. ఈ 76 మంది ఉద్యోగులను సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ చేసి సంస్థలో చేర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. విద్యుత్​ ఉద్యోగుల విభజనకు సంబంధించి నవంబర్​ 2, 3 తేదీల్లో జస్టిస్​ ధర్మాధికారితో తెలుగు రాష్ట్రాల విద్యుత్​సంస్థల అధికారులు భేటీ కానున్నారు.