డెవలప్​మెంట్​ పేరుతో స్వాధీనానికి సర్కారు స్కెచ్​

డెవలప్​మెంట్​ పేరుతో స్వాధీనానికి సర్కారు స్కెచ్​
  • కోట్లు పలికే భూమి  లక్షలకే తీసుకునే ప్లాన్​
  • ప్రపోజల్స్‌‌ పెట్టామంటున్న తహసీల్దార్‌‌‌‌ మండిపడుతున్న 
  • లక్ష్మీనారాయణ స్వామి భక్తులు

మెదక్​, నర్సాపూర్, వెలుగు: ల్యాండ్​ పూలింగ్ ​పేరుతో అసైన్డ్‌ భూములను తీసుకొని ప్లాట్లు చేసి అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్న సర్కారు ఎండో మెంట్​ భూములపైనా కన్నేసింది.  డెవలప్‌మెంట్​ పేరుతో బహిరంగ మార్కెట్‌లో కోట్లు పలికే భూమిని గుట్టుచప్పుడు కాకుండా లక్షలకే స్వాధీనం చేసుకుందుకు ప్లాన్​ చేస్తోంది. ఇందుకు సంబంధించి స్థానిక తహసీల్దార్‌‌ ఇప్పటికే సర్కారుకు ప్రపోజల్స్‌ పంపారు.  విషయం బయటికి రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుని భూములు కూడా వదలరా..? అని ప్రశ్నిస్తున్నారు. 

మొత్తం148 ఎకరాలు..

రెవెన్యూ డివిజన్ కేంద్రం, మున్సిపాలిటీ అయిన నర్సాపూర్ పట్టణంలోని పురాతన శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి 148 ఎకరాల భూమి ఉంది.  మెదక్ -–హైదరాబాద్‌ నేషనల్​ హైవే పక్కన, నర్సాపూర్​–సంగారెడ్డి మెయిన్​ రోడ్డు వెంట ఉన్న సర్వే నెంబర్​ 221 , 290, 391, 707, 708, 709, 710, 711, 712, 714, 715, 716, 717, 718, 719, 720, 721, 722, 723, 724, 725, 726, 727, 728, 70లలో ఈ భూమి విస్తరించి ఉంది. ఇందులో నుంచి 15 ఎకరాలను ఇప్పటికే  ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్‌ స్కూల్, కాలేజీకి కేటాయించారు. ఇది పోనూ ఇంకా 133 ఎకరాల భూమి ఉంది.  అయితే హద్దులు, రక్షణ ఏర్పాట్లు  లేకపోవడంతో  కొంతమేర కబ్జాకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఈ భూమిలో ఉన్న రాళ్లు, మట్టిని పెద్ద మొత్తంలో అక్రమంగా తరలించుకుపోయారు.  ప్రస్తుతం పట్టణంలో పోగయ్యే చెత్తను మున్సిపాలిటీ వారు ఇక్కడే పారబోస్తున్నారు.  

ఎకరా రూ.8 లక్షలకేనట..!

ఈ భూమి నేషనల్ హైవే వెంట ఉండటంతో ప్రభుత్వం డెవలప్ మెంట్​ పేరిట సేకరించేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం 148 ఎకరాల్లో ఇప్పటికే  15 ఎకరాలు అభివృద్ధి పనులకు పోగా.. మరో 15 ఎకరాలు ఎండోమెంట్‌కు ఉంచి 118 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. కానీ, ఏ అవసరాల కోసం  భూమిని తీసుకుంటున్నానే విషయం మాత్రం వెల్లడించడం లేదు. 

ఎకరా రూ.2 కోట్ల పైమాటే..

బాలానగర్ నుంచి నర్సాపూర్​ మీదుగా మెదక్​ వరకు నేషనల్​హైవే నిర్మాణం జరిగిన తర్వాత ఈ మార్గంలో ఉన్న భూముల ధరలు అమాంతం పెరిగాయి. నర్సాపూర్​ పట్టణ శివారులో హైవే వెంట ప్రస్తుతం మార్కెట్​ రేట్​ ప్రకారం ఎకరా రూ.2 కోట్ల వరకు పలుకుతుంది.  కానీ, ప్రభుత్వం  శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవాలయ భూమికి ఎకరాకు కేవలం రూ.8 లక్షల ధర చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిసింది.  

ప్రపోజల్​ పంపినం

లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమి సుమారు150 ఎకరాలు ఉంది. అందులో 5 ఎకరాలు ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీకి కేటాయించాం.  మరో 15 ఎకరాలు ఎండోమెంట్​ కు ఉంచి, మిగతా  భూమిని  డెవలప్‌మెంట్‌  కోసం తీసుకునేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్స్‌ పంపినం .  - ఆంజనేయులు, నర్సాపూర్​ తహసీల్దార్