వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటుంది: తలసాని

వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటుంది: తలసాని

ఇరత రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీలాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్ర తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని… అందుకోసమే మధ్యప్రదేశ్ , యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి కార్మికులు ఇక్కడికి వలసలు వస్తున్నారని తెలిపారు. గోశామహల్ నియోజకవర్గంలోని సీతారాం బాగ్ లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. సుమారు వేయి మంది నిరుపేదలకు ట్రస్ట్ ఛైర్మెన్ నందు కిషోర్ బిలాల్ తో కలిసి ఆయన సరుకులను అందజేశారు. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో… లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి 28 వేల మంది పేదలకు నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ కొనసాగే వరకు ట్రస్ట్ సహాయాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ తరుపున ఓ చిన్నారి చికిత్స కోసం 50 వేల చెక్కును , లాక్ డౌన్ లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు 10 వేల చొప్పున మంత్రి తలసాని చెక్కులను అందించారు.