గంజాయి సాగు చేసిన రైతులకు అన్నీ బంద్

గంజాయి సాగు చేసిన రైతులకు అన్నీ బంద్
  • వెల్ఫేర్​ స్కీమ్స్​ అందకుండా ప్రభుత్వం చర్యలు
  • ఇప్పటికే వంద మందికి పైగా రైతుల వివరాలు ఫ్రీజ్​

హైదరాబాద్, వెలుగు: గంజాయి సాగు చేస్తున్న రైతుల భూములను రాష్ట్ర సర్కారు బ్లాక్​లో పెడుతోంది. వారికి రైతుబంధుతో పాటు ఇతర వెల్ఫేర్ ​స్కీమ్స్ ​అందకుండా చర్యలు తీసుకుంటోంది. వివిధ జిల్లాల నుంచి ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ రైతుల వివరాలను అగ్రికల్చర్ ​డిపార్ట్​మెంట్‌కు పంపుతోంది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 21 మందికి రైతుబంధు ఆపేయాలని అధికారులు రిపోర్ట్​ పంపారు. ఇతర జిల్లాల నుంచి మరో 80 మంది రైతుల వివరాలు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. గంజాయి సాగు చేస్తే ఆ రైతులకు రైతుబంధు, రైతు బీమా కట్ చేయడంతో పాటు ఇతర స్కీమ్స్​ను నిలిపివేయాలని ఇటీవల సీఎం కేసీఆర్​ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

రైతుబంధుకు బడ్జెట్ తగ్గుతుందా?

రైతుబంధుకు 2022 – 23 సంవత్సరానికి బడ్జెట్‌లో నిధులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయశాఖ పంపిన బడ్జెట్ ప్రపోజల్స్​లో రూ.11,721 కోట్లు మాత్రమే చూపారు. రెండు సీజన్​లలో ఎకరాకు5 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.15 వేల కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారమే అధికారులు బడ్జెట్ ప్రపోజల్స్ ​పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు రూ.3 వేల కోట్లు తగ్గించడంతో రైతుబంధుపై ఏమైనా నిర్ణయం ఉంటుందా అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. రుణమాఫీకి రూ.2,905 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిసింది.