జీతాల కోతపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ

జీతాల కోతపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ

కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం… ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. మార్చి నెల వేతనాల్లో కొంత కోత విధిస్తూ.. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. కోత విధించిన మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత వారికి తిరిగి చెల్లిస్తారని అధికార వర్గాల సమాచారం. ఈ జీవో ప్రకారం ఎవరి వేతనాల్లో ఎంత శాతం కోత విధిస్తామన్న వివరాలు స్పష్టం చేసింది.

– ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో- 75%
– ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీస్ అధికారుల వేతనాల్లో- 60 %
– మిగతా అన్ని క్యాటగిరీ ఉద్యోగుల సాలరీల్లో – 50 %
– అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో – 50%
– నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో- 10%
– నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో- 10%