తెలంగాణ ప్రభుత్వం సరిహద్దు చెక్ పోస్టులును ఎత్తివేసింది

తెలంగాణ ప్రభుత్వం సరిహద్దు చెక్ పోస్టులును ఎత్తివేసింది

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి సడలింపులను మరింతగా పెంచిన తర్వాత… వివిధ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల దగ్గర గతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. దీంతో పలు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాలకు ప్రస్తుతం అధికారులు ఎటువంటి ఆటంకాలనూ కలిగించడం లేదు. ఇదే సమయంలో తమ వారిని చూసేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి బయలుదేరుతున్న తెలంగాణ వాసులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.