టాలెంట్​ సెర్చ్​ పరీక్షపై సర్కారు నిర్లక్ష్యం

టాలెంట్​ సెర్చ్​ పరీక్షపై సర్కారు నిర్లక్ష్యం
  • కరోనా పేరిట  తెలంగాణలో స్టేజ్​1 ఎగ్జామ్​ వాయిదా
  • జూన్​లో జరగనున్న స్టేజ్​2 పరీక్ష
  • వేలాది మందికినష్టం జరుగుతుందని పేరెంట్స్​ ఆందోళన

మెదక్, వెలుగు: ప్రతిభగల విద్యార్థులకు జాతీయ స్థాయిలో స్కార్​షిప్​లు ఇచ్చేందుకు నిర్వహించే ​ నేషనల్​ టాలెంట్​ సెర్చ్​ ఎగ్జామ్​ (ఎన్​టీఎస్​ఈ) నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. ఈ పరీక్షను కేంద్రప్రభుత్వం ఎన్​సీఈఆర్​టీ ద్వారా రెండు స్టేజ్​లలో నిర్వహిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో ఫస్ట్​ స్టేజ్​ పరీక్ష గత జనవరిలో జరిగాయి. అక్కడ రిజల్ట్స్​ కూడా ప్రకటించారు. తెలంగాణలో మాత్రం కరోనా ఆంక్షల పేరిట వాయిదా వేశారు. ఎన్​సీఈఆర్​టీ  రెండో స్టేజ్​ పరీక్ష జూన్​12న నిర్వహిస్తున్నట్టు ప్రకటించడంతో ఆక్కడి విద్యార్ధులు ప్రిపేరేషన్​ ప్రారంభించారు. తెలంగాణ స్టూడెంట్లు ఇంకా ఫస్ట్​స్టేజ్​ ఎగ్జామ్​కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువ టైమ్​లో రెండు స్టేజీల పరీక్షలకు ప్రిపేర్​ కావాల్సిఉన్నందున మిగతా రాష్ట్రాల వారికన్నా వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. 
ప్రతిభ గల స్టూడెంట్స్​ను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా కేంద్రప్రభుత్వం ఈ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్​ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.  రెండు దశల పరీక్షల్లో టాప్​ వచ్చిన వెయ్యి మంది స్టూడెంట్స్​ను సెలెక్ట్​ చేసి.. ఉన్నత విద్య కోసం స్కాలర్​ షిప్​ ఇస్తారు. ఇంటర్మీడియట్​లో నెలకు రూ.1,250, డిగ్రీ, పీజీలో నెలకు రూ.2 వేలు, పీహెచ్​డీ చేసే వారికి నెలకు రూ.5 వేల చొప్పున స్కాలర్​ షిప్​ వస్తుంది.  స్టేజ్​ -2 ఎగ్జామ్​ పాసై స్కాలర్​ షిప్​కు సెలెక్ట్​ అయిన స్టూడెంట్స్​ కు జేఈఈ లో, నీట్​ ఎగ్జామ్​లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.  ఏటా తెలంగాణా నుంచి చాలా మంది స్కాలర్​షిప్ లకు ఎంపికవుతుంటారు.   ఎన్​సీఈఆర్​టీ షెడ్యూల్​ ప్రకారం జనవరి 16న జరగాల్సిన  స్టేజ్ 1 పరీక్ష ను తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించలేదు. కొవిడ్​ తీవ్రత తగ్గి.. విద్యా సంస్థలు అన్నీ తెరిచినప్పటికీ ప్రభుత్వం ఈ ఎగ్జామ్​ గురించి పట్టించుకోవడంలేదు. ఇంటర్​ నుంచి పీహెచ్​డీ వరకు స్కాలర్​ షిప్​ రావడంతోపాటు, జేఈఈ, మెడిసిన్​ అడ్మిషన్​ కోసం నిర్వహించే నీట్​ పరీక్షలో రాణించేందుకు ఉపయోగపడుతుందన్న ఆశతో చాలామంది పదో తరగతి స్టూడెంట్స్​ నెలల తరబడి ఎగ్జామ్​ కోసం  ప్రిపేర్​ అవుతారు. చాలామంది  ప్రత్యేకంగా కోచింగ్​ కూడా తీసుకుంటారు. స్టేజ్​ 2 ఎగ్జామ్​ కూడా దగ్గర పడుతున్నందున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని,  త్వరగా స్టేజ్​ -1 పరీక్ష నిర్వహించి టాలెంట్​ ఉన్న స్టూడెంట్స్​ నష్టపోకుండా చూడాలని పేరెంట్స్​కోరుతున్నారు. 

ఏడాది నుంచి ప్రిపేర్​ అవుతున్నా

నేను టాలెంట్​ సెర్చ్​ ఎగ్జామ్​ కోసం ఏడాది నుంచి ప్రిపేర్ అవుతున్న.  జనవరి నెలలోనే స్టేజ్​ -1 నిర్వహించి ఉంటే ఆ పరీక్షతో పాటు టెన్త్​ఎగ్జామ్స్​కు,  స్టేజ్ 2 కోసం ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేది. డిలే కావడంవల్ల స్టేజ్​2 ఎగ్జామ్​ ప్రిపరేషన్ కు టైమ్​ సరిపోదు. ​

- వేద సంహిత్​ గౌడ్​, 10వ తరగతి, కొల్చారం, మెదక్ జిల్లా

టాలెంట్​ ఉన్న  స్టూడెంట్స్​కు నష్టం

టాలెంట్​ ఉన్న  స్టూడెంట్స్​ను ఎంకరైజ్​ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం  ఎన్​ టీ ఎస్​ ఈ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహించకపోవడం వల్ల  స్టూడెంట్స్​ నష్టపోతారు. స్టేజ్​ -2 కు ఇంకా రెండు నెలల టైమే ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్​ -1 పరీక్ష నిర్వహించి స్టూడెంట్స్​ నష్టపోకుండా చూడాలి.

- వి.నగేష్​, పేరెంట్​, మెదక్​